Sunday, March 25, 2007

Naado blogu, daaniko fanu

Naaku oka amaayakapu friend undi. bottigaa panii paata leni vyavahaaram. naa blog chadavatam tana hobbyta(anduke amaayakuraalu annadi). ivala rendu post lu chesa ani sambarapadi andariki phonelu chesi marii cheppeyyatam modalettindi.

Nenu manchivadini kada, tanu ala kastapadutunte chustu ooruko leka poyaa. Enta mandikani phone chestaav, sukhamgaa mike pettinchuko ani salaha ichesaa.

Salaha aithe icha kani, dabbulu kooda nene iste feel avutundani cheppi, aa chance tanake ichsaa. Tanu mohammata padi vaddanna, nene balavantamga bill tana chethe kattincha. Nenu intha encouragement istunte janalu nannu kanjoos antaru. Bothigaa kalaa hrudayam ledu.

నాకు ఒక అమాయకపు ఫ్రెండ్ ఉంది. బొత్తిగా పనీ పాట లేని వ్యవహారం. నా బ్లాగ్ చదవటం తన హాబీట(అందుకే అమాయకురాలు అన్నది). ఇవాళ రెండు పోస్ట్ లు చేశా అని సంబరపడి అందరికి ఫోన్లు చేసి మరీ చెప్పేయటం మొదలెట్టింది.

నేను మంచివాడిని కదా, తను అలా కస్టపడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయా. ఎంత మందికని ఫోన్ చేస్తావ్, సుఖంగా మైక్ పెట్టించుకో అని సలహా ఇచ్చేశా.

సలహా ఐతే ఇచ్చా కాని, డబ్బులు కూడా నేనే ఇస్తే ఫీల్ అవుతుందని చెప్పి, ఆ ఛాన్స్ తనకే ఇచ్ఛేశా. తను మొహమ్మాట పడి వద్దన్నా, నేనే బలవంతంగా బిల్ తన చేతే కట్టించా. నేను ఇంత ఎంకరేజ్ మెంట్ ఇస్తుంటే జనాలు నన్ను కంజూస్ అంటారు. బొత్తిగా కళాహృదయం లేదు.

Evadi focus vadidi -2

Arrey indakati post lo asalu cheppali anukunnadi cheppatam marchipoyaa

Ee focus gola anthaa MBA chadivetappudu modalayyindi. Finance ante istam unnavaallu, maadi 'Fin Focus' ani, alaage Marketing istam unna vaallu 'Mar-foussed' ani cheppukuntaaru.

Nenu cheppukoledu kaani, friends maatram naadi 'Food-focus' ane vaallu. Durmaargulu. Adi nijam kaadani naa blog chadive meeku, raase naaku telustundi kaani.

Meeru chaduvuthu undandi, nenu ippude tinataaniki emainaa tecchukocchi, inko blog bloguthaa


ఆర్రే!!! ఇందాకటి పోస్ట్ లో అసలు చెప్పాలి అనుకున్నది చెప్పటం మర్చిపొయా!

ఈ ఫోకస్ గోల అంతా "MBA" చదివేటప్పుదు మొదలయ్యింది. ఫైనాన్స్ అంటే ఇస్టం ఉన్నవాళ్లు, మాది "ఫిన్ ఫొకస్" అని, అలాగే మార్కెటింగ్ ఇష్టం ఉన్న వాళ్లు 'మార్-ఫొకస్డ్ అని చెప్పుకుంటారు.

నేను చెప్పుకోలేదు కాని, ఫ్రెండ్స్ మాత్రం నాది "ఫుడ్-ఫోకస్" అనే వాళ్లు. దుర్మార్గులు. అది నిజం కాదని నా బ్లాగ్ చదివే మేకు, రాసే నాకు తెలుస్తుంది కాని.

మీరు చదువుతూ ఉండండి, నెను ఇప్పుడే తినటానికి ఎమైనా తెచ్చుకొచ్చి, ఇంకో బ్లాగ్ బ్లాగుథా

Evadi focus vadidi -1

Edo pani unna vaadilaa gaba gabaa office nunchi intiki bayaludera.
Raithu bazar antha konesina vaadilaa araganta sepu shop antha vetiki kooralu koni techaa.
Ganta sepu chemata vodchi kastapadi vaatini kadigi cut, chesi, vanta chesaa.

Pchh em laabham, vandinadantha khaali cheyyataniki ten minutes pattaledu...
Bonus gaa inko ganta sepu tomukotaniki ginnelu maatram tayarayyayi.

Worst of it all, naaku malli aakali started :(

ఏవడి ఫోకస్ వాడిది అంటే తెలుసా?

ఏదో పని ఉన్న వాడిలా గబ గబా ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరా.
రైతు బజార్ అంతా కొనెసే వాడిలా అరగంట సేపు షాప్ అంతా వెతికి కూరలు కొని తెచ్చా.
గంట సేపు చెమట వోడ్చి కస్టపడి వాటిని కడిగి కట్, చేసి, వంట చేసా.

ప్చ్హ్ ఏం లాభం, వండినదంతా ఖాళీ చెయ్యటానికి టెన్ మినిట్స్ పట్టలేదు...
బొనస్ గా ఇంకో గంట సేపు తోముకోటానికి గిన్నెలు మాత్రం తయరయ్యయి.

అసలు సీన్ ఎక్కడ బాడ్ అయిందంటే "నాకు మళ్లీ ఆకలెస్తోంది, ఏమైనా తిందాం అనిపిస్తోంది